Saturday, 14 May 2016

దినఫలం


రాశి లక్షణాలు మేషం
ప్రేమానుబంధాలు, నూతన పరిచయాలు మరింత బలపడతాయి. దూర ప్రయాణంలో ఒత్తిడి, చికాకు తప్పదు. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడటం మంచిది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకు తప్పవు. కళా రంగాల్లో వారికి పురోభివృద్ధి.


రాశి లక్షణాలు వృషభం
రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు ఆశాజనకం. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి శ్రమాధిక్యత.


రాశి లక్షణాలు మిథునం
వాతావరణంలో మార్పువల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళకు మెళకువ అవసరం.


రాశి లక్షణాలు కర్కాటకం
స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విందు, వినోదాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాక, మీ సీనియర్ల సలహాలను తీసుకుని ముందుకు సాగండి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి. గత విషయాలు జ్ఞప్తికిరాగలవు.


రాశి లక్షణాలు సింహం
రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం అందడంతో తాకట్టు పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి, కార్మికులతో చికాకులు తప్పవు. సేవ, పుణ్య కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.


రాశి లక్షణాలు కన్య
మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. లీజు, ఏజెన్సీలు, టెండర్ల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి.


రాశి లక్షణాలు తుల
డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రీమతి లేక శ్రీవారి ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రవాణా రంగాలవారికి మెళకువ అవసరం. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. ఇతరులు చెప్పిన మాటపై దృష్టిపెట్టకండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.


రాశి లక్షణాలు వృశ్చికం
హోటల్, స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఒప్పందాలు, చెక్కుల జారీలో ఏకాగ్రత ముఖ్యం. అనుకోకుండా కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం సద్వినియోగం చేసుకోవడం మంచిది. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.


రాశి లక్షణాలు ధనస్సు
దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికం. పత్రికా సంస్థలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ చాలా అవసరం. మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది.


రాశి లక్షణాలు మకరం
ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఖర్చు, పెరగటంతో రుణ యత్నాలు చేబదుళ్ళు తప్పవు.


రాశి లక్షణాలు కుంభం
రాజకీయనాయకులు తొందరపడి వాగ్ధానాలు చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు నడము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ ఏమరుపాటు తనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.


రాశి లక్షణాలు మీనం
కొత్త వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. యాధృశ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విదేశీయానం కోసం ప్రయత్నాలు వాయిదాపడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సభలు, సమావేశాల్లో మీ ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకం.

No comments: