Friday, 6 May 2016

దినఫలం

మేషం
స్త్రీలకు తల, మెడ, నడుం, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. రావలసిన ధనం సకాలంలో అందుట వలన పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి వ్యాపారులకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి ఉండదు.

వృషభం
రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. మీ సరదాలు కోరికలు వాయిదా వేసుకోవాల్సివస్తుంది భాగస్వామికుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనంగా ఉండదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తుంది.

మిథునం
ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఓర్పు, నేర్పు వ్యవహరించవలసి వస్తుంది. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. సోదరీ సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసివస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
కర్కాటకం
విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి అందుకు తగిన ప్రోత్సహం లభిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది.

సింహం
మొక్కుబడులు తీర్చుకోవాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. రిప్రజెంటేటివ్‌లు, కొబ్బరి పండ్లు, పూలు కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల నుండి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కొంటారు. ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి.


కన్య
విందులు, దైవ పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. స్త్రీలు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల
కొత్తగా చేపట్టిన వ్యాపారాలలో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. హోటల్, కేటరింగ్ రంగాలవారికి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగడం మంచిదని గమనించండి. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు.


వృశ్చికం
విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పెద్దలను ప్రముఖులను కలుసుకుని వారికి బహుమతులు అందజేస్తారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి.

ధనస్సు
ప్రైవేటు సంస్థలలోని వారికి విదేశాలు వెళ్ళే అవకాశం లభిస్తుంది. స్తీలు విలువైన వస్తువులు చేజార్చుకునే ఆస్కారం ఉంది. ప్రముఖుల సహకారంతో మీ సమస్య పరిష్కారమవుతాయి. ఇళ్ల స్థలాలు పొలాల అమ్మకంలో పునరాలోచన మంచిది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి వుండదు.


మకరం
నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. సాహసకృత్యాలకు, వాదోపవాదాలకు ఇది సమయం కాదని గమనించండి. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. వాతావరణంలో మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది.

కుంభం
భాగస్వాముల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.


మీనం
వ్యాపారాభివృద్ధికి అహర్ని‌శలు శ్రమిస్తారు. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. అర్థాంతరంగా నిలిపి వేసిన పునఃప్రారంభమవుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. యాధృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

No comments:

Post a Comment