రాశి లక్షణాలు మేషం
ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుమంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మందులు, ఎరువులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసివచ్చే కాలం. బ్యాంకు వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి.
రాశి లక్షణాలు వృషభం
విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. పెట్టుబడులు, వ్యాపారాలు విస్తరణలకు అనుకూలం. దైవ, సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో చికాకులు తప్పవు. రుణం ఏ కొంతైనా తీర్చడానికి చేయు యత్నాలు అనుకూలిస్తాయి.
రాశి లక్షణాలు మిథునం
ప్రముఖులతో కలిసి సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాల్, కొబ్బరి, పానీయ వస్తు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ప్రయాణాలు చికాకులు కలిగిస్తాయి.
రాశి లక్షణాలు కర్కాటకం
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు సందర్శిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ఆశయ సిద్ధికి ప్రముఖుల తోడ్పాటు, పెద్దల సహకారం లభిస్తుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు చికాకులు తప్పవు.
రాశి లక్షణాలు సింహం
భాగస్వామ్య వ్యాపారస్తులకు పరస్పర అవగాహన, అభివృద్ధి కానరాగలదు. అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. విద్యార్థుల ఉత్సహాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. గృహమునకు కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం.
రాశి లక్షణాలు కన్య
ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. అవివాహితులకు అనుకున్న సంబంధాలు కుదురుతాయి. సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగులకు ఇచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం మంచిది కాదు. ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికం.
రాశి లక్షణాలు తుల
ఉద్యోగస్తులు, సహోద్యోగుల ప్రసంశలు అందుకుంటారు. విద్యార్థినులకు ధ్యేయం పట్ల అవగాహన ముఖ్యం. కొత్త కొత్త విషయాలపై ఆసక్తి నెలకొంటాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
రాశి లక్షణాలు వృశ్చికం
భాగస్వామిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థినుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. హోటల్, క్యాటరింగ్ పనివారలకు అభివృద్ధి. రావలసిన ధన కొంతమొత్తమైనా చేతికందుతుంది. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడి. దూర ప్రయాణాలు చికాకులను కలిగిస్తాయి.
రాశి లక్షణాలు ధనస్సు
వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనం ఉంటాయి. ఆపరేషన్లు సమయంలో వైద్యులు, నర్సులకు ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా నిర్వహిస్తారు.
రాశి లక్షణాలు మకరం
కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు వివాహ సంబంధాలు కుదుర్చుకుంటారు. స్త్రీలకు కళ్లు, తల, నరాలు ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మార్కెటింగ్ రంగాల వారు ఏజెంట్లు, బ్రోకర్ల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది.
రాశి లక్షణాలు కుంభం
రవాణా, ఎగుమతి రంగాల వారికి శుభదాయకం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
రాశి లక్షణాలు మీనం
ఆడిటర్లకు అభివృద్ధి, ప్లీడర్లకు సంతృప్తి కానరాగలవు. ప్రేమ అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. శుభకార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో సందడి నెలకొంటుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. దైవ, సేవా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల విషయాలలో తలదూర్చటంవల్ల మాటపడక తప్పదు.